¡Sorpréndeme!

Mumbai Indians Ashwani Kumar | బుమ్రా నుంచి అశ్వనీ వరకూ ముంబై టాలెంట్ హంట్ కి హ్యాట్సాఫ్ | ABP Desam

2025-04-01 0 Dailymotion

 టాలెంట్ ను వెతికి పట్టుకోవాలే కొత్త కుర్రాళ్లు తమ క్రికెట్ కలను తీర్చుకోవాటనికి ఐపీఎల్ ను మించిన వేదిక మరొకటి లేదు. ఇక్కడ స్టార్లుగా నిలబడిన వాళ్లు సంవత్సరం తిరిగే సరికి టీమిండియా క్రికెట్లోకి అడుగుపెట్టేస్తున్నారు. అలా ఈ ఏడాది ముంబై తరపున ఇద్దరు యువ కెరటాలు చాలా అంటే చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నారు. ఒకరు లెఫ్టార్మ్ స్పిన్నర్ విఘ్నేశ్ పుత్తూరు అయితే మరొకరు లెఫార్మ్ పేసర్ అశ్వనీ కుమార్. ముంబై ఆడిన తొలి మ్యాచ్ లో చెన్నై పై చెపాక్ లో మూడు వికెట్లు తీసి ధోని నుంచి ప్రశంసలు అందుకున్నాడు విఘ్నేశ్ పుత్తూరు. కేరళకు చెందిన విఘ్నేశ్ టాలెంట్ ను గమనించిన ముంబై స్కౌటింగ్ టీమ్ తనకు ఎలాంటి లిస్ట్ ఏ క్రికెట్ అనుభవం లేకపోయినా నేరుగా ముంబై క్యాంప్ కు తీసుకువచ్చేసింది. అంచనాలకు తగ్గట్లుగానే మొదటి మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన విఘ్నేశ్ రెండో మ్యాచ్ లో అవకాశం దక్కకపోయినా నిరుత్సాహ పడకుండా మూడో మ్యాచ్ లో మళ్లీ తిరిగొచ్చి నిన్న కేకేఆర్ పై మంచిగా బౌలింగ్ చేశాడు. మరొకరు నిన్న కేకేఆర్ ను అల్లాడించి ఓటమి రుచి చూపించిన లెఫార్మ్ పేసర్ అశ్వనీ కుమార్. పంజాబ్ కు చెందిన అశ్వనీ కుమార్ తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసి ప్రకంపనలు రేపాడు. రహానే, రింకూ, మనీశ్ పాండే, రస్సెల్ లాంటి ఆటగాళ్లను అవుట్ చేసి తనలో ఎంత టాలెంట్ ఉందో ప్రూవ్ చేయటంతో పాటు ఆడిన మొదటి మ్యాచ్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు అశ్వనీ కుమార్. ఈ ఇద్దరు ఆటతీరుతో చాలా ప్రామిసింగ్ గా కనిపించటంతో పాటు ఫ్యూచర్ పైనా ఆశలు రేపుతున్నారు. ఎందుకంటే ముంబై ఇలా అనామకులుగా పరిచయం చేసిన ఆటగాళ్లే ఇప్పుడు టీమిండియాను నడిపిస్తున్నారు. 2013 లో బుమ్రా, 2015లో హార్దిక్ పాండ్యా, 2022లో తిలక్ వర్మ ఇలానే నార్మల్ ప్లేయర్లుగా వచ్చి తమ సత్తా చాటుకుని తర్వాత టీమిండియాలో చోటు సంపాదించి ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్నారు. చూడాలి విఘ్నేశ్, అశ్వని కుమార్ ఏ హైట్స్ కి వెళ్తారో. ముంబై స్కౌటింగ్ టీమ్ కు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాలి..కేవలం ముంబై ఇండియన్స్ కే కాకుండా టీమిండియా క్రికెట్ కూడా ఫ్యూచర్ స్టార్స్ ను వెతికి పట్టుకుంటున్నందుకు.